కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధిస్తున్న రాష్ట్రాలకు.. కేంద్రం కీలక సూచనలు చేసింది. కేంద్రం లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో.. కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో పలు రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నామని ప్రకటిస్తున్నాయి. బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే, కేంద్రం దీని గురించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ఉత్తినే ప్రకటించడం వలన ఎలాంటి ఉపయోగం లేదని.. లాక్‌డౌన్‌ను లాభదాయకంగా మార్చుకోవాలని అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబందనలు కఠినంగా అమలు చేయాలని అన్నారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలని.. సామాజిక దూరం పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే, ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్రం ప్రకటించింది.