రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఏపీ ప్రభుత్వం గవర్నర్ దగ్గరకు పంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లులను ఆమోదించవద్దని ప్రతిపక్షాలు గవర్నర్ ను కోరుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు గవర్నర్‌కు లేఖ రాశారు. ఇప్పుడు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ గవర్నర్ కు లేఖ రాశారు. ఆ రెండు బిల్లులను తిరస్కరించాలని కోరుతూ లేఖ రాశారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చిందని రామకృష్ణ అన్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించగానే.. అసెంబ్లీలో వైసీపీ మద్దతు పలికిందని అన్నారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు అవసమని కూడా అప్పటి మాజీ ప్రతిపక్షనేత జగన్ మాటలను గుర్తు చేశారు. రాజధాని శంకుస్థాపనను ప్రధాని మోదీ చేశారని.. కేంద్రం అమరావతి నిర్మాణానికి 1550కోట్లు నిధులు కేటాయించిందని అన్నారు. అమరావతి ప్రాంతంలో 9600 కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగాయిని అన్నారు. ఈ బిల్లుకు ప్రజా ఆమోదం లేదని.. దీనిని తిరస్కరించాలని.. లేదని యడల రాష్ట్రపతి వద్దకు పంపాలని సూచించారు.