ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. చిన్నా,పెద్దా తేడాలేకుండా ఈ మహమ్మారి అందరినీ ఇబ్బందులు పెడుతోంది. ఒకవైపు కరోనా భయపెడుతుంటే.. మరోవైపు కరోనా బాధిత చినారుల్లో కవాసాకీ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇటీవల కరోనా పాజిటివ్‌తో ఢిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో చేరిన పలువురు చిన్నారుల్లో కవాసాకీ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కవాసాకీ అనేది అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణం మాత్రం తెలియదని అంటున్నారు.
ఈ కవాసాకీ వ్యాధి ఐదేళ్లలోపు చిన్నారుల్లో కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో తీవ్ర జ్వరం ఉంటుంది. దాదాపు ఐదు రోజులకుపైగా జ్వరం లక్షణాలు కనిపిస్తాయి అంటున్నారు.