అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. బొకాహట్‌లోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌ను కూడా వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో చిక్కుకుని పార్కులోని 96 జంతువులు మృత్యువాత పడినట్లు అసోం సర్కార్ ప్రకటించింది. చనిపోయిన వాటిలో 74 హాగ్ డీర్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.