వీరప్పన్‌ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి

Update: 2020-07-19 19:01 GMT

గంధపుచెక్కలు స్మగ్లింగ్ చేస్తూ కొన్నేళ్ళకిందట తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర పోలీసులను ముప్పుతిప్పలుపెట్టిన మీసాల వీరప్పన్ కుమార్తె ఈ ఏడాది భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తమిళనాడులో వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్‌కు బీజేపీ ఇటీవల కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెను తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించింది. అయితే ఆమె నియమాకం కోదిరోజుల కిందటే ఖరారైనా పార్టీలో అసంతృప్తుల కారణంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించడం వాయిదా వేశారు.

ఆదివారం ఇందుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్య పిబ్రవరి నెలలో దాదాపు వెయ్యి మంది మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వీరప్పన్ సామాజిక వర్గాన్ని అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా విద్యకు ఈ పదవి కట్టబెట్టినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Similar News