అసోంలో వరదలు కారణంగా రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుంది. కొండచరియలు విరిగి కొన్ని ప్రాంతాల్లో, వరదల్లో కొట్టుకుపోయి మరికొన్ని ప్రాంతాల్లో.. ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం.. 123మంది చనిపోయారు. కాగా.. రాష్ట్రంలో ఈ వరదల ప్రభావం 70 లక్షల మందిపై పడింది. ఓ వైపు కరోనా, మరోవైపు వరదలు కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు లోనవుతున్నారు. అసోం సీఎం సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ ఈ విపత్తులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని.. బాధితులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తున్నాయని తెలిపారు. వరదల కారణంగా.. 123మంది చనిపోగా.. కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో 109 జంతువులు కూడా చనిపోయాయన్నారు.