ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో 4,074 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం సంఖ్య 53,724 కు చేరింది. ఇప్పటివరకూ 24,228 మంది కోలుకోగా.. ఇంకా.. 28,800 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజులోనే 54మంది కరోనాతో మృతి చెందగా.. కరోనా మృతుల సంఖ్య 696కు చేరింది.