రాష్ట్రపతిని కలవనున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు

Update: 2020-07-21 12:37 GMT

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. తన రక్షణతోపాటు ఏపీలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించనున్నారు. మరోవైపు సోమవారం కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ.. రఘురామకృష్ణంరాజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు రెండు వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.

తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు ఆగస్టు ఆరుకు వాయిదా వేసింది. కాగా ఏపీలో ఇసుక అక్రమ రవాణా, ఇళ్ల స్థలాలలో అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ.. పార్లమెంటులో ఆయన సీటును కూడా మార్చేలా స్పీకర్ ను కోరింది.

Similar News