పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరగడంతో సామాన్యులు సొంత వాహనాలు తీయాలంటే భయపడుతున్నారు. కాగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్యుడికి మరింత భారం అవతోంది. ఇంధన ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వ్యతిరేకించారు. ఈ మేరకు ట్విట్టర్ లో సెటైరికల్ గా స్పంధించారు. ధరలు పెంచి మద్యనిషేధమన్న మేధావి, కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమోనంటూ ట్వీట్ చేశారు. ‘‘బాదుడే బాదుడు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్‌పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేశారు. పెట్రోల్, డీజిల్‍పై అదనపు వ్యాట్‍ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే. ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.