ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే నటీ నటులు దాదాపు నాలుగు నెలల నుంచి ఇంట్లోనే ఉండడంతో బోర్ ఫీలవుతున్నారు. మార్గదర్శకాలను అనుసరించి షూటింగ్ లు మొదలు పెడదామన్నా ఏ ఒక్కరికీ ధైర్యం చాలడం లేదు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు పరిస్థితి ఇలానే ఉంటుందేమో. లాక్ డౌన్ తర్వాత చాలా సంస్థలు తెరుచుకున్నా జిమ్ లు, థియేటర్లు వంటివి తెరుచుకోలేదు. దీంతో హీరోయిన్ రకుల్ ప్రీత్ వర్కవుట్లను చాలా మిస్ అవుతున్నానని అంటోంది. ఫిట్‌నెస్ కు అధిక ప్రాధాన్యమిచ్చే రకుల్ కి హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో సొంత జిమ్ సెంటర్లు ఉన్నాయి. తాజాగా తన పాత ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. జిమ్‌కు వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పోస్ట్ పెట్టింది. కాగా, కమల్ నటిస్తున్న భారతీయుడు-2, అర్జున్ కపూర్ సినిమాల్లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.