అమూల్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం

Update: 2020-07-21 20:59 GMT

ఏపీ ప్రభుత్వం.. అమూల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై అగ్రికల్చర్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌ హెడ్‌ రాజన్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పంద సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ వాణీ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో పాడి రైతులకు ఎంతో లాభం జరుగుతుందని సీఎం జగన్ అన్నారు.

Similar News