నిమ్మగడ్డ రమేష్‌ను ఎస్ఈసీగా తిరిగి నియమించాల్సిందేనని గవర్నర్ బిశ్వభూషన్ ఆదేశించారు. కోర్టుతీర్పులను ప్రభుత్వం అమలు చేయాలని గవర్నర్ ఆదేశించారు. రమేష్ కుమార్ నియామకంపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోవడంతో.. ఇటీవల హైకోర్టు ఆయనను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు, రమేష్ కుమార్ కూడా గవర్నర్‌ను కోర్టు తీర్పులను అమలు చేయాలని ఆదేశించాలని కోరమని హైకోర్టు సూచించింది. దీంతో ఆయన గవర్నర్ ను కలిసి మొత్తం వ్యవహారాన్ని వివరించారు. రమేష్ కుమార్ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ తాజా ఆదేశాలు జారీ చేసింది.