కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చెల్లుబోయిన వేణుగోపాల్ కు.. బిసి సంక్షేమ శాఖ.. సీదిరి అప్పలరాజుకు మత్స , పశుసంవర్ధక శాఖ కేటాయించారు. అలాగే ఇద్దరు పాత మంత్రుల శాఖలను కూడా మార్చేశారు. రోడ్లు భవనాల శాఖా మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ను.. రెవెన్యూ మంత్రిగా ప్రమోట్ చేశారు.. ఆయనకు డిప్యూటీ సీఎం హోదాను కూడా కట్టబెట్టారు. ఇక మరో మంత్రి శంకర్ నారాయణ నిన్నటివరకూ బీసీ సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్నారు.. ఆయనకు తాజాగా రోడ్డు, భవనాల శాఖ అప్పజెప్పారు.