ఇంట్లోనే ఉన్నా కొవిడ్ బారిన..

Update: 2020-07-23 13:50 GMT

దక్షిణ కొరియా దాదాపు 5,706 మంది కరోనా రోగులపై పరిశోధనలు ప్రారంభించి ఓ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన వారు ఇంట్లోని కుటుంబసభ్యులకు అంటించేస్తున్నారు. దాంతో గడప దాటకుండా ఇంట్లోనే ఉన్న వారు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ప్రతి వంద మందిలో కేవలం ఇద్దరికి బయటి వ్యక్తుల ద్వారా వైరస్ సోకుతుందని గుర్తించారు. అలాగే ప్రతి పది మందిలో ఒకరు తమ కుటుంబీకుల ద్వారానే వైరస్ బాధితులుగా మారుతున్నారని తేలింది. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ఈ విషయాలు వెల్లడించింది. కుటుంబాలలో వైరస్ సంక్రమణ అధికంగా ఉన్నందున ఎలా పరిమితం చేయాలనే దానిపై పరిశోధనలు మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.

Similar News