లవర్ బాయ్ తరుణ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో కనిపించనున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. బిగ్ బాస్ ప్రోమో ప్రసారం అయిన వెంటనే, పోటీదారుల గురించి పుకార్లు ఇంటర్నెట్‌లో ప్రసారం అయ్యాయి. ఈ సీజన్ 4 తరుణ్ కీలక పోటీదారుగా ఉంటారని.. ఇందుకోసం బిగ్ బాస్ ప్రతినిధులు తరుణ్ ను సంప్రదించారని రూమర్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై తరుణ్ వివరణ ఇచ్చారు. తాను బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనడం లేదని.. ఈ ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. తాను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఈ షోలోకి రాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పష్టత ఇచ్చారు.