తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,367 శాంపిల్స్ పరీక్షించగా 1567 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 662 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,826కి చేరింది.
ఈ ఒక్క రోజే 9 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అలాగే కరోనా మృతుల సంఖ్య 447కి పెరిగింది. ఈ ఒక్క రోజులో 1661 మంది కరోనా నుంచి కోలుకున్నారని, దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 39,327కి చేరిందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం 11,052 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది.