రాజధాని వికేంద్రీకరణ.. సీఆర్డీఏ రద్దు బిల్లులు తిరిగి గవర్నర్ కార్యాలయానికి చేరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయ విభాగం రెండు బిల్లుల్ని గవర్నర్ కు పంపినట్టు సమాచారం. ఈ అంశంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. బిల్లుల్ని యధాతధంగా ఆమోదిస్తారా లేదా అన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీలే కాదు, రాష్ట్రప్రజల దృష్టి అంతా రాజ్ భవన్ వైపే ఉంది. ఒకవైపు మూడు రాజధానులను ప్రజలు, రైతులు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళుతోంది. గవర్నర్ నిర్ణయంపై ఎవరికివారు ధీమాగా ఉన్నారు.