కరోనా నిర్ధారణ అయిన తరువాత కనిపించకుండా పోయిన 236 మంది బాధితులు

Update: 2020-07-24 21:33 GMT

ఏపీలో కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతుంటే. మరోవైపు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత బాధితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఇప్పటికే 236 మంది బాధితులు కనిపించడం లేదు. దీనిపై వైద్య అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. టెస్టులు చేయించుకున్నప్పుడు వారి తప్పుడు నంబర్లు అడ్రస్ లు ఇవ్వడంతో గాలింపు కష్టంగా మారింది. ఆ 236 మంది ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News