దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కోసం సరైన సమయంలో షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది. 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆర్పీ చట్టం-1951లోని 151 ఏ సెక్షన్ కింద ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల ఎనిమిది నియోజక వర్గాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 7వ తేదీ వరకూ ఈసీ వాయిదా వేసిన విషయం తెలసిందే.