విజయవాడలో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీ తరహాలో దోపిడీ జరిగింది. వన్ టౌన్ లోని సాయిచరణ్ జువెలర్స్ లో ఓ దుండగుడు ఏకంగా 7 కేజీల బంగారాన్ని రూ.30 లక్షల నగదును దోచుకున్నాడు. షాపులో ఉన్న గుమస్తా కాళ్ళు చేతులు కట్టేసి.. మొత్తం కొల్లగొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తోంది.