మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీతకు పితృ వియోగం కలిగింది. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సునీత తండ్రి ధర్మవరపు కొండన్న చాలా ఏళ్లగా నసనకోట ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్‌గా పని చేసిన విషయం తెలిసిందే. టీపీపీనేత పరిటలా రవీంద్ర మరణం తరువాత ఆ కుటుంబానికి కొండన్నే పెద్ద దిక్కుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన మరణంతో పరిటాల కుటుంబంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.