రాజస్థాన్ రాజకీయాలు క్షణక్షనికి మారుతూ సస్పెన్స్ త్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ఉదయం వరకూ గెహ్లాట్ వర్సెస్ పైలెట్ గా కనిపించిన సీన్లు ఇప్పుడు మారిపోయాయి. తాజా పరిణామాలు చూస్తుంటే సీఎం వర్సెస్ గవర్నర్ అన్నట్టుగా తయారయ్యాయి. ఓ వైపు వేటు వేయాల్సిన ఎమ్మెల్యేలపై ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే తాజాగా సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. కానీ గవర్నర్ కలరాజ్ మిశ్రా గెహ్లాట్ వినతిని తిరస్కరించారు. దాంతో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ ను ముట్టడించారు అశోక్ గెహ్లాట్. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు అందరూ అశోక్ గెహ్లాట్ కు మద్దతుగా.. సచిన్ పైలట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.