భూముల ధరలు పైపైకి.. 5 నుంచి 50 శాతానికి..

Update: 2020-07-26 13:31 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లోని ఖాళీ స్ఠలాలు, వ్యవసాయ భూములు, అపార్టుమెంట్ల భూముల మార్కెట్ విలువను పెంచేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 1 నుంచి ఈ నిర్ణయం అమలుపరచాలని చూస్తోంది. ఆయా ఏరియాకి ఉన్న డిమాండ్ ను అనుసరించి భూముల విలువను కనీసం 5 నుంచి 50 శాతానికి పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధరలను ఎంత మేర పెంచాలన్న నిర్ణయం పై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక స్పష్టత వెలువడలేదు. దీంతో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని డిమాండ్ ను అనుసరించి భూముల విలువలను సవరించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్, మే నెలల్లో రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతింది. అయినా భూముల విలువను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పెంపు ప్రతిపాదనను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో పెట్టిన అనంతరం.. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. దాన్ని బట్టి పెంపు నిర్ణయం ముందుకు సాగుతుంది.

Similar News