వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చెయ్యాలి : మాజీ ఎంపీ హర్షకుమార్

Update: 2020-07-25 18:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై వరుస దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడికి న్యాయం చేయాలనీ కోరుతూ ఆయన రాజమండ్రిలో ఒకరోజు దీక్ష చేపట్టారు. బాధితుడు వరప్రసాద్ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా నాయకులు ఈ దీక్షకు మద్దతు పలకాలని హర్షకుమార్ కోరారు.

ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి అసలు నిందితులను పెట్టుకోకపోవడం దారుణమని అన్నారు. అలాగే చీరాలలో పోలీసుల దాడిలో చనిపోయినట్లుగా భావిస్తున్న కిరణ్ కుమార్ ది కూడా ప్రభుత్వ హత్యేనని హర్షకుమార్ మండిపడ్డారు. దళితులపై అరాచకాలకు వంతపాడుతున్న ఈ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చెయ్యాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

Similar News