కరోనా : ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కుటుంబసభ్యుల నివేదిక..

Update: 2020-07-26 19:06 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సతీమణి, అలాగే ఇద్దరు కుమారుల కరోనా రిపోర్ట్ వచ్చింది. వారి ముగ్గురికి కరోనా సోకలేదని తెలిసింది. ఈ విషయాన్నీ శివరాజ్ సింగ్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. 'మిత్రులారా, నేను బాగున్నాను. నిస్వార్థంగా ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు సేవ చేస్తున్న రాష్ట్రంలోని కరోనా యోధులందరికీ నా వందనం.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ సతీమణి సాధన, కుమారులు కార్తికేయ, కునాల్ ముందుజాగ్రత్తగా ఇంటి వద్ద 14 రోజుల నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నారు.. అలాగే తమను ఇటీవల కలిసిన వారెవరైనా పరీక్షను తప్పనిసరిగా చేసుకోవాలని శివరాజ్ కుటుంబం విజ్ఞప్తి చేసింది. కాగా ముఖ్యమంత్రి శివరాజ్ కు శనివారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత ఆయనను భోపాల్ లోని వివా ఆసుపత్రిలో చేర్చారు.

Similar News