కరోనా కారణంగా అతలాకుతలమైన ఢిల్లీ ఆర్దిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేజ్రీవాల్ సర్కార్ సిద్ధమవుతుంది. ఉపాధి కల్ఫన కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించనుంది. నిరుద్యోగుల కోసం ప్రత్యేక జాబ్ పొర్టల్‌ను త్వరలో ప్రకటిస్తామని.. దీని ద్వారా కంపెనీలను ఉద్యోగార్థులను ఒక్కచోటకు తేవడమే తమ ఉద్దేశ్యమని ఢిల్లీ కార్మికశాఖ మంత్రి అన్నారు. కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని.. ఈ కార్యక్రమంతో వారికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా.. కుప్పలు కూలిన ఆర్థిక వ్యవస్థను పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తీసుకోవలసిన చర్యలను సూచించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల మొదట్లో 12 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.