రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని బీజేపీ నేత హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు ఈ పిటిషన్ ను తోసి పుచ్చింది. దీనికి ముందు, బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ దాఖలు పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. అసెంబ్లీ స్పీకర్ ఉత్తర్వుకు సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు అందజేయాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కు ఆదేశించింది. ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలతో కలపి కాంగ్రెస్.. తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుందని మదన్ దిలావర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అనర్హతను స్పీకర్ నిర్ణయించడాన్ని కూడా ఆయన సవాల్ చేశారు. మరోవైపు, విలీనంపై బీజేపీ వేసిన పిటిషన్‌లో తమను కూడా చేర్చాలని కోరుతూ బీఎస్‌పీ సైతం హైకోర్టును ఆశ్రయించింది.