పంట భీమా సక్రమంగా అమలు చేసేందుకు రైతుల సౌకర్యం కోసం ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీజీఐసీఎల్ కు చైర్మన్, ఎండీలను నియమించింది. ఏపీజీఐసీఎల్‌కు
చైర్మన్‌గా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఎండీగా ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వ్యవసాయ ఉత్పత్తులకు భీమా కల్పించటమే లక్ష్యంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఏర్పడిందని అధికారులు చెప్పారు.