బెంగళూరులో కుప్పకూలిన భవనం

Update: 2020-07-29 14:06 GMT

బెంగళూరు ఓ భవనం కుప్పకూలింది. నగరంలో కపిల్ థియేటర్‌కు వెళ్లే దారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కపిల్ థియేటర్‌ను కూల్చి మల్టిఫ్లెక్స్ కడుతుండగా పక్కన ఉన్న మూడంతస్తుల మేజెస్టిక్ హోటల్ ఒక్కసారిగా కూలిపోయింది. మల్టిఫ్లెక్స్ కోసం దాదాపు 80 అడుగుల లోతులో భారీ గొయ్యిని తవ్వారు. అయితే దాని పక్కనే ఉన్న బిల్డింగ్‌పై ప్రభావం పడింది. దీంతో పగుళ్లు వచ్చి భవనం ఒక్కసారిగా కుప్పకూలిందని అధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు పక్క భవనంలో ఉన్నవారిని కూడా ఖాళీ చేయించారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు.

Similar News