దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత వారం రోజులుగా 46 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 48 వేలకుపైగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 15 లక్షలు దాటాయి.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,513 మంది కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,31,669కి చేరింది. ఇందులో 5,09,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారి నుండి 9,88,030 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 768 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతులు 34,193కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో రికవరీ రేటు 65కు చేరింది.