ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి చంపాయ్‌లో రాత్రి 8 గంటకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదయ్యిందని ఎన్‌సీఎస్ తెలిపింది. చంపాయ్‌కి 27 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
అటు మహారాష్ట్రలో కూడా భూమి కంపించింది. ఈ ఘటన పాల్ఘర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.8గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.