దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాని కట్టడి చేయడానికి పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తున్నారు.
కోల్‌కతాలో ఎక్కడికక్కడ బంద్ పాటిస్తున్నారు. వాహనాలను తిరగనివ్వడం లేదు. రాష్ట్రంలో వారానికి రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ను ఆగస్టు 31వ తేదీ వరకు అమలు చేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక మధ్యప్రదేశ్‌లో కూడా గురువారం నుంచి పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ పాటించనున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు సర్కార్ తెలిపింది.