భారీగా పెరిగిన బంగారం ధర

Update: 2020-07-29 10:15 GMT

బంగారం ధర భారీగా పెరిగింది. వారం రోజులుగా పరుగులు పెడుతోన్న గోల్డ్ రేట్.. రూ.55,000 మార్క్‌కు చేరువవుతోంది. బల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1949 డాలర్లుకు చేరింది. ఇక హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.54,940కి చేరింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ. 50,370కి పెరిగింది. బంగారంతో పాటు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,000కి చేరింది. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు అంటున్నాయి. ఇదే విధంగా ధరలు పెరుగుకుంటాపోతే సామాన్యుడికి బంగారం అందని దాక్షగా మిగలనుంది.

Similar News