కోస్తా ఆంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి

Update: 2020-07-29 18:56 GMT

పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడులకు 5.8 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఇది నైరుతి దిశ వైపునకు వెళ్లే దిశగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, తెలంగాణ మీదుగా 1.5 కిమీ ఎత్తు వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.

దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే శుక్రవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Similar News