జమ్మూ కాశ్మీర్‌లో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు గత రెండురోజుల నుంచి పెరుగుతున్నాయి. గురువారం 450 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 20,000 మార్కుకు చేరుకున్నాయి. అయితే ఇందులో 11,842 మంది రోగులు ఘోరమైన వైరస్ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంలోని కోవిడ్ -19 యాక్టీవ్ కేసుల సంఖ్య ఇప్పుడు 7,662 గా ఉంది. కరోనావైరస్ సోకిన రోగులు గురువారం 17 మంది మరణించారు. కోవిడ్ -19 ఇందులో ఒకరు జమ్మూ , 16 మంది కాశ్మీర్ కు చెందిన రోగులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 365 గా ఉంది.