మోదీ ప్రైవేట్ సెక్రటరీగా సతీష్‌చంద్ర షా

Update: 2020-07-30 22:38 GMT

ప్రధానిమోదీకి ప్రైవేట్ సెక్రటరీగా హార్దిక్ సతీష్‌చంద్ర షా నియమితులయ్యారు. ప్రస్తుతం పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ఆయన తాజాగా మోదీ ప్రైవేట్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు. 2019 ఆగస్టు నుంచి ఆయన పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. ఆయన గుజరాత్ కు చెందిన 2010 క్యాడర్ అధికారి. సుమారు మూడేళ్ల నుంచి ఆయన కేంద్రంలో డిప్యూటేషన్ పై ఉన్నారు. గతంలో ఆయన కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రైవేట్ కార్యదర్శిగా కూడా పని చేశారు.

Similar News