తెలంగాణలోని మహబూబాబాద్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురేసి మాజీ మిలిటెంట్లు, మావోయిస్టులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వివరాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. వారి వద్ద నుంచి 414 తుపాకీ, తూటాల డంప్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.
జిల్లాలోని గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పరిధి మామిడిగూడెం, మిర్యాలపేట ప్రాంతాలకు చెందిన బండి సుధాకర్, కల్తి సమ్మయ్య, పోలెబోయిన సారయ్య మావోయిస్టు మిలిటెంట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ ముగ్గురిని ఆదివారం దుబ్బగూడెంలో అరెస్టు చేశారు.