తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. 59 ఏళ్ల రాజయ్య కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో రాజయ్యకు కుటుంబీకులు కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా రావడంతో విజయవాడ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అయితే చిక్సిత్స పొందుతూ అక్కడే కన్నుమూశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున మూడుసార్లు గెలిచారు. 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన మ్మెల్యేగా ఎన్నికయ్యారు.