తెలంగాణలో కొత్తగా 1286 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-08-04 13:48 GMT

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నిత్యం పాజటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 391 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 121 నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 68,946 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 18,708 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా బారి నుంచి కోలుకుని 49,675 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12 మంది వైరస్‌ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 563కు చేరింది. కాగా, ఐసోలేషన్‌లో 11,935 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 72 శాతం రికవరీ రేటు నమోదు చేసిందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

Similar News