తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది. ముఖ్యంగా నాలుగు అంశాలతో ఈ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్.. ఆర్కిటెక్టులతో రెండు సార్లు సమావేశం అయి సెక్రెటేరియేట్ నమూనాను ఖరారు చేశారు. ఈ నమూనాపై చర్చించి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కూడా చర్చిస్తారు.
వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యారంగంపై కూడా చర్చ జరగనుంది. పలు ఎంట్రెన్స్ పరీక్షలు, డిగ్రీ , పీజీ , ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలు వాయిదా పడ్డాయి.. వీటిని ఎప్పుడు నిర్వహించాలి.. స్కూళ్ళు , కాలేజీలు మళ్ళీ ఎప్పుడు తెరవాలి అనే అంశాలపై కూడా చర్చించనున్నారు.