తెలంగాణలో కరోనా కేసులు..

Update: 2020-08-07 11:43 GMT

రాష్ట్రంలో గురువారం 2,207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 75,257కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 12 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి కోలుకుని 1,136 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 53,239కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,417 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో నిర్వహించిన కొవిడ్ పరీక్షల సంఖ్య 5,66,984కు చేరుకుంది. నిన్న అత్యధిక పాజిటివ్ కేసులు జీహెచ్ ఎంసీ పరిధిలో నమోదయ్యాయి.

Similar News