చిత్తూరు జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా

Update: 2020-08-08 19:43 GMT

చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. వాగులు, నదుల్లో ప్రకృతి సంపదను అక్రమార్కులు రాష్ట్రాలు దాటిస్తున్నారు. ఏపీలో లారీ ఇసుక ఆరువేల నుంచి ఎనిమిది వేలు పలుకుతుంటే ఇతర రాష్ట్రాలలో 25 వేలకు అమ్ముతున్నారు. దీంతో కొందరు నాయకులు, అధికారుల అండదండలతో ఇసుకను సరిహద్దును దాటిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గం కాళ్లుపల్లె గ్రామంలోని కౌండిన్య నదిలో 80 శాతం ఇసుకను అక్రమ రవాణా చేసి కోట్లు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, అధికారులు మాత్రం ఇదేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

Similar News