పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఆరో విడత నిధులు విడుదల

Update: 2020-08-10 10:38 GMT

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పేద రైతులకు ఏటా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా(రూ.2వేలు చొప్పున) అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 2018, డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలవుతుండా, ఆదివారం ఆరో విడత నగదు బదిలీ చేశారు ప్రధాని. కాగా ఈ పథకం కోసం కేంద్రం రూ.75 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

Similar News