రష్యా విడుదల చేసిన వ్యాక్సిన్ ను కెనడా తిరస్కరించింది. ఈ వ్యాక్సిన్ కెనడాలో ఆమోదించబడదని డిప్యూటీ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ హోవార్డ్ న్జూ అన్నారు. ఈ వ్యాక్సిన్‌కు సబంధించి తగిన సమాచారం లేనందున తాము ఆమోదించలేమని ఆయన చెప్పారు. కరోనా వ్యాక్సిన్ రష్యానే ముందుగా కనిపెట్టిందని ఆదేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన న్జూ.. రష్యాలో ఇంత త్వరగా టీకా ఆమోదం పొందడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. కెనడా చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ థెరిసా టామ్ కూడా దీనిపై స్పందించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే పరిణామాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయని, విదేశాల్లో ఉన్న ఇతర శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.