బ్రహ్మయ్య అండ్‌కో.. సీఏ ఆఫీస్‌లో ఏపీ సీఐడీ అధికారుల సోదాలు ముగిశాయి. 27 గంటపాటు బ్రహ్మయ్య అండ్ కో ఆఫీస్‌లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ 27 గంటల పాటు 12 మంది సిబ్బందిని బయటికి కూడా రానివ్వలేదు. సంస్థ యజమానుల్లో ఒకరైన 80 ఏళ్ల కోటేశ్వరరావును సైతం.. 27 గంటల పాటు కార్యాలయంలోనే ఉంచారు. ఆరోగ్యం సహకరించట్లేదు.. రాత్రికి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానన్నా సీఐడీ అధికారులు విన్పించుకోలేదు, ఎర్రమంజిల్ కాలనీలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాట్‌లో బ్రహ్మయ్య అండ్ కో సీఏ సంస్థ ఉంది. 50 మంది పోలీసులు ఒక్కసారిగా రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. సోదాల్లో సీఐడీ డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది.