ఏపీలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేదు: బుద్దా వెంకన్న
ఏపీలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు;
ఏపీలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన ఉన్నప్పటికీ.. రామతీర్థం ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడం దారుణమన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు బుద్దా వెంకన్న.