స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ సర్కార్ వర్సెస్ తెలంగాణ సర్కార్‌గా మారింది. అటు ఏపీ కార్మికులు తెలంగా ణకు రావాలన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు. అయితే అంతే ధీటుగా మం త్రి హరీష్ రావు సైతం కౌంటర్ వేశారు. తెలంగాణలో ప్రాంతియవాద రాజకీయాలు మాత్రమే ఉన్నాయన్నారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. అయితే తెలంగాణకు వచ్చి చూడు ఏముందో తెలుస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ బిడ్డింగ్ వేయడం వల్లే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని... అది ఏపీ నేతలు తెలుసుకోవాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో కొట్లాడకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తుంది ఏపీ ప్రభుత్వం అన్నారు. తమతో అనవసరంగా పెట్టుకోవద్దని సీదిరి అప్పలరాజుకు సూచించారు హరీష్ రావు.