ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు!
తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,189 కరోనా పరీక్షలు చేయగా, 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.;
ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,189 కరోనా పరీక్షలు చేయగా, 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,87,466కి చేరింది. కాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో ఏ ఒక్కరూ మృతిచెందలేదు. దీంతో మృతుల సంఖ్య 7,152 మందిగా ఉంది. కాగా ఒక్కరోజు వ్యవధిలో 128 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,358 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,30,12,150 కరోనా టెస్టులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.