AP Corona Cases : ఏపీలో పదివేలు దాటిన మరణాలు..!

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,609 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 19,981 కేసులు నమోదయ్యాయి

Update: 2021-05-22 12:54 GMT

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,609 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 19,981 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో కొత్తగా 118 మరణాలు సంభవించాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,62,060కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 10,022కు చేరింది. ఇక కొత్తగా 18,336 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీ సంఖ్య 13,41,355కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,10,683 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News