AP corona cases : ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!
AP corona cases : ఏపీలో నిన్నటితో పోల్చితే కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా, 2,010 కేసులు బయటపడ్డాయి.;
AP Corona Cases
AP corona cases : ఏపీలో నిన్నటితో పోల్చితే కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా, 2,010 కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 470 కేసులు అదనంగా పెరిగాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19,59,942కి చేరింది. ఇక కరోనాతో మరో 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య 13,312కి చేరింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో 1,956 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,25,631కి చేరింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.